కావలి బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భం గా ఆ సంఘ అధ్యక్షులు ఎం.వి.చలపతి రావు , కార్య దర్శి డి.వి.నాగరాజ శర్మ , కోశాధికారి గంగు వి. చంద్ర శేఖర్ గార్లు 23 వ వార్డు కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్ తో కలిసి కావలి ఎం.ఎల్.ఎ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఎం.ఎల్.ఎ గారు ఎన్నిక కాబడిన వారిని అభినందించి తన సహాయ సహకారాలు వారికి ఎల్ల వేళలా వారికి వుంటాయని హామీ ఇచ్చారు.
Friday, 10 November 2017
Tuesday, 7 November 2017
National Water Mission Andhra Pradesh - పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం
పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. పూణెలో ‘సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్’ (CWPRS) ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు నమూనాను అయన పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సహకారం అందించగా ఎకరం విస్తీర్ణంలో సుమారు రూ. 40 లక్షల వ్యయంతో రూపకల్పన చేశారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఎటువంటి సవాళ్లనయినా ఎదుర్కొంటామని అన్నారు. పోలవరం కాంక్రీట్ పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో కొంతమేర కొత్త నిర్మాణ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం. స్పిల్‌వే, స్పిల్ చానల్‌కు సంబంధించి పనుల్లో కొంత భాగానికి ఈవారంలో టెండర్లు. ప్రాధాన్య ప్రాజెక్టులలో పదింటిని ఈనెలలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మూడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 15 ప్రాజెక్టులు డిసెంబర్ కల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉత్తమ నీటి నిర్వహణే లక్ష్యంగా వచ్చే నెలలో ప్రతి గ్రామంలోనూ ‘నీటి ఆడిటింగ్’ నిర్వహించాలని అధికారులకు సూచించారు. రెండోపంటకు నోచుకోని భూములకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు కృషి చేయాలి అన్నారు. ఇస్రో అధికారులు రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం సమన్వయంతో పని చేయడం అభినందించారు.
Andhra Pradesh is to serve as role model for the National Water Mission in other states for which we ensure a timely update on the progress of Polavaram & other irrigation projects. The target of diaphragm wall has been met and authorities have been instructed to conduct an exercise to analyse and understand the requirements of the state in terms of climate, resources & technology.
During the meeting, officials presented a video of the Polavaram Dam's miniature, set up in Central Water and Power Research Station (CWPRS), Pune. The video was helpful in gaining an idea about the mechanics and practical implications of the Polavaram Dam. In a video conference, 28 irrigation projects were reviewed, 10 projects are going to be inaugurated this month.
Wednesday, 1 November 2017
మహబూబ్ నగర్ జిల్లా నకిలీ పాస్ బుక్ లు సృష్టించి ఓ బ్యాంకు నుంచి ఏకంగా 63 లక్షల రూపాయాలకు టోకరా
జిల్లా కేంద్రంలో నకిలీ పాస్ బుక్ లు సృష్టించి ఓ బ్యాంకు నుంచి ఏకంగా 63 లక్షల రూపాయాలకు టోకరా వేసిన వైనం. మహబూబునగర్ లో చోటుచేసుకుంది. 67 మంది బినామి రైతుల పేర్లను సృష్టించి. ఓ వ్యక్తి మొత్తం డబ్బులను కాజేసిన విషయాన్ని సదరు బ్యాంకు అధికారులు గుర్తించారు.
దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. మహబూబునగర్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 2016 సంవత్సరానికి గాను పంట రుణాలను తీసుకునేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించాడు. 67 మంది బినామి పేర్లతో, 63 లక్షల, 78 వేల రూపాయలను, నకిలీ పాస్‌పుస్తకాల ద్వారా బ్యాంకు నుంచి బుణంగా పొందాడు.
వ్యవసాయ సాగు భూమి లేకుండానే ఉన్నట్లుగా, సృష్టించిన నకిలీ పాస్ పుస్తకాలతో, నిందితుడు శ్రీనివాస్ ఈ బుణాన్ని తీసుకున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసిన అనంతరం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిగా నకిలీ పాస్ పుస్తకాల పూర్తి వివరాలు బయటపడింది. అసలు నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. విచారించిన నిమిత్తం తొమ్మది మందిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు...
శక్తిమంతమైన హెచ్‌ఐవీ టీకా...!!!
వాషింగ్టన్: హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించే శక్తిమంతమైన టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. వైరస్‌కు రక్షణ కల్పించే గ్లూకోజ్ అణువులకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించడంలో ఇది క్రియాశీలంగా పనిచేస్తోంది. కుందేళ్లపై అమెరికాలోని మేరీలాండ్ వర్సిటీ నిపుణులు దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీంతో భిన్న వైరస్‌లకు రక్షణ కవచంలా నిలుస్తున్న జీపీ120 ప్రోటీన్ గోడలను వ్యాధి నిరోధక కణాలు బద్దలుకొట్టగలిగినట్లు వెలుగులోకి వచ్చింది.
‘హెచ్‌ఐవీ బలం పుంజుకోవడంలో జీపీ120 కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రించేందుకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు గుర్తించేంత రీతిలో ఫలితాలనివ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రోటీన్లనే మరికొన్ని ప్రోటీన్లతో కలిపి ప్రోటీన్-గ్లూకోజ్ టీకా తయారుచేశాం. ఇది కుందేళ్లలోని వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచింది’అని పరిశోధనలో పాలుపంచుకున్న లై షీ వాంగ్ తెలిపారు.Sunday, 22 October 2017
సమస్యల నిలయం ఇందిరమ్మ కాలనీ వలయం- కందుకూరి....
భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రకాశం జిల్లా మరియూ కావలి నియోజకవర్గ ఇంచార్జ్ కందుకూరి వెంకట సత్యనారాయణ, కావలి పట్టణంలో ముసునూరు నుండి కొత్త శివాలయం మరియూ బాలక్రిష్ణారెడ్డి నగర్ సరిహద్దులుగానున్న ఇందిరమ్మ కాలనీని స్థానిక ప్రజల విన్నపం మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ కాలనీలో నివశించే ప్రజలు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని కావలి మున్సిపాలిటీ వారికి ఇవి కనిపించటం లేదని అన్నారు.
ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు అయ్యినప్పటినుండి ఇప్పటివరకు రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, రేషన్ షాపులు లేక నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లపై నడవలేక రాకపోకలు సాగించేందుకు అవస్థ పడుతున్నారు, రాత్రి పూట వీధి లైట్లు లేక విషపురుగుల బారిన పడుతున్నారు, కావలి పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రజలకు మంజూరైన కాలనీ కావడం వలన వారు రేషన్ సరుకులు తీసుకొనేందుకు చాలాదూరం ప్రయానిన్చాల్సివస్తోంది.
పేదలు ఇన్ని సమస్యలు పడుతుంటే మాకేమీ తెలియవన్నట్లుగా పట్టణంలో సిమెంట్ రోడ్లపై రోడ్లు, డివైడర్లపై డివైడర్లు వేయిస్తూ “అమృత్” పధకం ద్వారా వచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని, కేంద్రంలో నరేంద్రమోడీ గారు పేదప్రజల అభ్యున్నతి కొరకు పనిచేస్తుంటే ఇక్కడ పేదలకు అన్యాయం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ కమీషనర్ పేదలకొరకు నిధులు ఉపయోగించకపోతే తీవ్ర పరిణామం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరితోపాటు, కావలి అసెంబ్లీ కన్వినర్ మరియు కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ CVC సత్యం, రాష్ట్ర మహిళామోర్చా కార్యవర్గ సభ్యురాలు ప్రత్తిపాటి వరలక్షమ్మ, జిల్లా OBC మోర్చా ఉపాధ్యక్ష్యులు షేక్ మస్తాన్ వలీ, పట్టణ భాజపా నాయకులు కంచర్ల మురళి నాయుడు, యిన్నమూరి సూర్యం, కల్లయ్య, మల్లికార్జున, పట్టణ మహిళా మోర్చా నాయకురాలు నారాయణమ్మ, రాజేశ్వరి, మరియు అధికసంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Thursday, 5 October 2017
సెల్‌ఫోన్ పేలి యువకుడి మృతి...!!!
టి.నగర్ : వర్షం పడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టి వాట్స్‌పలో చాటింగ్ చేస్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక రెడ్‌హిల్స్ ప్రాంతంలో బుధవారం వేకువజామున ఈ సంఘటన జరిగింది. రెడ్‌హిల్స్ నాగాతమ్మన్ నగర్‌కు చెందిన రంజిత్ (21) తిరుప్పాచ్చూర్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం కురుస్తుండగా రంజిత్ తన సెల్‌ఫోన్‌కు చార్జర్‌ను కనెక్ట్ చేసి వాట్సప్‌లో చాటింగ్ చేయసాగాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పిడుగుపడింది. వెంటనే సెల్‌ఫోన్ నుంచి మంటలు చెలరేగాయి.
అత్యధిక ఓల్టేజీతో అతడి దేహమంతా విద్యుత్ ప్రసారం కావటంతో రంజిత్ గావుకేకలు పెట్టి నేలపై కుప్పకూలిపడ్డాడు. ఆ అరుపులు విన్న రంజిత్ తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్న కుమారుడిని హుటాహుటిన రెడ్‌హిల్స్ ఎంఏ నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. చోళవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Subscribe to:
Comments (Atom)








