Wednesday, 1 November 2017

శక్తిమంతమైన హెచ్‌ఐవీ టీకా...!!!

వాషింగ్టన్‌: హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించే శక్తిమంతమైన టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. వైరస్‌కు రక్షణ కల్పించే గ్లూకోజ్‌ అణువులకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించడంలో ఇది క్రియాశీలంగా పనిచేస్తోంది. కుందేళ్లపై అమెరికాలోని మేరీలాండ్‌ వర్సిటీ నిపుణులు దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీంతో భిన్న వైరస్‌లకు రక్షణ కవచంలా నిలుస్తున్న జీపీ120 ప్రోటీన్‌ గోడలను వ్యాధి నిరోధక కణాలు బద్దలుకొట్టగలిగినట్లు వెలుగులోకి వచ్చింది.
‘హెచ్‌ఐవీ బలం పుంజుకోవడంలో జీపీ120 కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రించేందుకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు గుర్తించేంత రీతిలో ఫలితాలనివ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రోటీన్లనే మరికొన్ని ప్రోటీన్లతో కలిపి ప్రోటీన్‌-గ్లూకోజ్‌ టీకా తయారుచేశాం. ఇది కుందేళ్లలోని వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచింది’అని పరిశోధనలో పాలుపంచుకున్న లై షీ వాంగ్‌ తెలిపారు.


EmoticonEmoticon