Sunday, 22 October 2017

సమస్యల నిలయం ఇందిరమ్మ కాలనీ వలయం- కందుకూరి....

భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రకాశం జిల్లా మరియూ కావలి నియోజకవర్గ ఇంచార్జ్ కందుకూరి వెంకట సత్యనారాయణ, కావలి పట్టణంలో ముసునూరు నుండి కొత్త శివాలయం మరియూ బాలక్రిష్ణారెడ్డి నగర్ సరిహద్దులుగానున్న ఇందిరమ్మ కాలనీని స్థానిక ప్రజల విన్నపం మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ కాలనీలో నివశించే ప్రజలు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని కావలి మున్సిపాలిటీ వారికి ఇవి కనిపించటం లేదని అన్నారు.
ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు అయ్యినప్పటినుండి ఇప్పటివరకు రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, రేషన్ షాపులు లేక నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లపై నడవలేక రాకపోకలు సాగించేందుకు అవస్థ పడుతున్నారు, రాత్రి పూట వీధి లైట్లు లేక విషపురుగుల బారిన పడుతున్నారు, కావలి పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రజలకు మంజూరైన కాలనీ కావడం వలన వారు రేషన్ సరుకులు తీసుకొనేందుకు చాలాదూరం ప్రయానిన్చాల్సివస్తోంది.
పేదలు ఇన్ని సమస్యలు పడుతుంటే మాకేమీ తెలియవన్నట్లుగా పట్టణంలో సిమెంట్ రోడ్లపై రోడ్లు, డివైడర్లపై డివైడర్లు వేయిస్తూ “అమృత్” పధకం ద్వారా వచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని, కేంద్రంలో నరేంద్రమోడీ గారు పేదప్రజల అభ్యున్నతి కొరకు పనిచేస్తుంటే ఇక్కడ పేదలకు అన్యాయం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ కమీషనర్ పేదలకొరకు నిధులు ఉపయోగించకపోతే తీవ్ర పరిణామం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరితోపాటు, కావలి అసెంబ్లీ కన్వినర్ మరియు కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ CVC సత్యం, రాష్ట్ర మహిళామోర్చా కార్యవర్గ సభ్యురాలు ప్రత్తిపాటి వరలక్షమ్మ, జిల్లా OBC మోర్చా ఉపాధ్యక్ష్యులు షేక్ మస్తాన్ వలీ, పట్టణ భాజపా నాయకులు కంచర్ల మురళి నాయుడు, యిన్నమూరి సూర్యం, కల్లయ్య, మల్లికార్జున, పట్టణ మహిళా మోర్చా నాయకురాలు నారాయణమ్మ, రాజేశ్వరి, మరియు అధికసంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.


EmoticonEmoticon